31, డిసెంబర్ 2010, శుక్రవారం

ఉబుంటు 10.04 నుంచి 10.10 కి మారడం ఎలా..?

ఉబుంటు 10.10 మేవరిక్ మీర్కట్ ఈ ఏడాది అక్టోబర్లో విడుదలైంది.ఒకవేళ మీరు కనుక ఉబుంటు 10.04 లుసిడ్ (LTS) లాంగ్ టెర్మ్ సప్పోర్ట్ లేదా దానికంటే పాత వెర్షన్ వాడుతుంటే మీరు కొత్త వెర్షన్(ఉబుంటు 10.10 మేవరిక్ మీర్కట్)కి అప్ గ్రేడ్ అవ్వానుకుంటే క్రింద తెలిపిన సూచనల ద్వారా అవ్వొచ్చు.

కీ బోర్డ్ మీద Alt+F2 మీటలను నొక్కండి.

ఆ తరువాత "Run Application" విండో ప్రత్యక్షమవుతుంది.

update-manager -d
అని టైపు చెయ్యండి. 

అప్ డేట్ మేనేజర్ విండో ఓపెన్ అవుతుంది అందులో కొత్త ఉబుంటు విడుదల లభ్యం అని కనపిస్తుంది బొమ్మలో చూపిన విధంగా...


మొదటగా ఏమైనా అప్ డేట్స్ చెయ్యవలసినవి అప్ డేట్ మేనేజర్ లో చూపిస్తే వాటిని మొదట ఇన్స్టాల్ చెయ్యండి ఆ తరువాత కొత్త వెర్షన్ కి అప్ గ్రేడ్ చెయ్యండి.

దీని సైజ్ సుమారు 1 జిబి వుంటుంది. మీది 100 kbps నెట్వర్క్ కనెక్షన్ అయితే సుమారు మూడు గంటలు పడుతుంది.


డెబియన్ ఇన్స్టాలర్ ఇకనుంచి తెలుగులో...

అర్జున రావు గారి కృషి/తోట్పాటు వల్ల ఇకనుంచి త్వరలోనే మనందరం డెబియన్ మరియు ఆధారిత ఆపరేటింగ్ సిస్టంల స్థాపన ప్రక్రియను తెలుగులో ప్రారంభించవచ్చు.సాధారణంగా మనం ఆపరేటింగ్ స్థాపన మొదలుపెట్టేటప్పుడు మొదటగా మనం (ఆంగ్లంలో) భాషను ఎంచుకుని ప్రారంభిస్తాము ఇదే పనిని మీరు సులభంగా ఇప్పటినుంచి తెలుగులో కూడా చెయ్యవచ్చు.డెబియన్ వారు తొందరలోనే వారి కొత్త వెర్షన్ డెబియన్ 6.0 Squeeze విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెర్షన్ ను మీరు తెలుగులోనే స్థాపించవచ్చు.
అర్జున రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ ప్రక్రియను నేను పరీక్షించాను మీ ముందు స్థాపక ప్రక్రియ తెరచాపలను ఉంచుతున్నాను వీక్షించి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తున్నాను. దీనిని మీరు తెలుగులినక్స్ యు ట్యూబ్ ఛానల్లో కూడా చూడవచ్చు.



























22, డిసెంబర్ 2010, బుధవారం

ఉబుంటు

 
ఓపెన్ఆప్యాయత..!
అంతా ఉచితం..!’ అంటే -అటు ఎగబడే వారూ ఉన్నారు..! ఇటు పోదూ బడాయి అని నవ్వేసేవారూ ఉన్నారు! కొనలేని స్థితిలో పైరసీకి సిద్ధమే కానీ, చచ్చినా ఓపెన్ సోర్సు వొద్దు బాబోయ్ ! అనేవారు సైతం ఈ చిన్ని వ్యాసం చదవండి. విండోస్ కన్నా దీటుగా ఉబుంటు అనే లినక్స్ వెర్షన్ ఉచితంగా దొరుకుతుంది. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ప్రస్తుతానికి రెండో స్థానంఉబుంటూదే ! రేపో, ఎల్లుండో అది ప్రథమస్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి ఆరు నెలలకీ దీని కొత్త వెర్షన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఆటోమేటిగ్గా మీ పీసీలో అప్డేట్ చేసేసుకోవచ్చు కూడా. ప్రతీ వెర్షన్ కీ 18 నెలల సపోర్టు గ్యారంటీ.‌‌‌‌

'ఉబుంటు' పేరు వినడానికే చాలా తమాషా. అటు లినక్స్ కుటుంబం ఆదరణా, ఇటు ప్రొఫెషనల్స్ తోడ్పాటూ వెరసి ఉబుంటు లినక్స్ -ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ‘సాఫ్ట్వేర్ అనేది ఉచితంగా దొరకాలి. అందరూ వారి వారి స్థానిక భాషల్లో వాడుకోగలగాలి. యూజర్లు తాము కోరుకున్న రీతిలో కస్టమైజ్ చేసుకునే వీలుండాలి’ -ఇదీ ఉబుంటు మేనిఫెస్టో. ఇది ఏదో ఆషామాషీ భారతీయ ఎలెక్షన్ మానిఫెస్టో కాదు. సాఫ్ట్వేర్ నిపుణులు చెప్పిందే చేసి చూపించే ఆపరేటింగ్ సిస్టం.
ఇంతకీఉబుంటుఅనేది జులు, హాసా భాషాలకు సంబంధించిన పదం. దక్షిణ ఆఫ్రికాలో మానవీయ సంబంధాలను వ్యక్తీకరించే ఒక భావన అది. ఒకరికొకరు, పరస్పరం చూపుకునే ఆప్యాయతకు మారుపేరుఉబుంటు’! అందుకే లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు వచ్చింది. ఓపెన్ సోర్స్ అంటే, అంతేకదా! ఆకాశమే హద్దు. అలాంటప్పుడు ఈ వసుధైక కుటుంబాన్ని కలిపే శక్తిఉబుంటుకే ఉందనడం అతిశయోక్తి కాదు. ఇంటెల్, ఎఎమ్డి ప్రాసెసర్ల మీదే కాదు, సన్ ఆల్ట్రా, స్పార్క్, అమెజాన్ ఇసి 2 ఆర్కిటెక్చర్లో సైతం పనిచేసేలా నేడు ఉబుంటూ దొరుకుతోంది. ప్రజాదరణతో అందరికీ చేరువవుతోంది! ఆఖరికి ఎంటర్ప్రేజ్ వెర్షన్ కూడా ఫ్రీగా లభిస్తోంది. ఇది అత్యుత్తమ ట్రాన్స్లేషన్, యాక్సెసబిలిటీ సౌకర్యాలను కలిగి ఉంది. ఉబుంటు ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సులభం. అంతా 20 నిముషాల పని. ఉబుంటు 10.4 వెర్షన్ ఏప్రిల్ 2010లో అందుబాటులోకి వచ్చింది. ఉబుంటు 10.10 వెర్షన్ అక్టోబర్లో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి సాయం కావాలన్నా, ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలన్నా ఎన్నో వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి.

10, డిసెంబర్ 2010, శుక్రవారం

ఉబుంటులో ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ ఇంస్టాల్ చెయ్యటం ఎలా..?


మీకు తెలుసా ఉబుంటు/లినక్స్ లో విద్య కొరకు చాలా సాఫ్ట్వేర్లు రూపొందించారు.ఇవి అన్ని లినక్స్ పంపకలలోను వాడవచ్చు.ప్రత్యేకంగా కేవలం విద్య కోసమే కూడా కొన్ని లినక్స్ పంపకాలు వున్నాయి అవే ఎడుబుంటు, స్కోల్ లినక్స్.మీరు ఒకవేళ ఉబుంటు వాడుతుంటే ఈ సాఫ్ట్వేర్లను ఉబుంటులోనే క్రింద తెలిపిన విధంగా సంస్థాపించి వాడుకోవచ్చు.వీటిని నాలుగు రకాలుగా విభజించారు.
1 . ప్రి స్కూల్ (<5 సంవత్సరాలలోపు వారికి )
2 . ప్రైమరీ (6 -12 సంవత్సరాల వారికి )
3 . సెకండరీ (12 - 18 సంవత్సరాల వారికి )
4 . ఉన్నత విద్య (విశ్వ విద్యాలయాల స్థాయి ) 

 

టెర్మినల్ ను తెరచి ఈ కమాండులను ప్రవేశ పెట్టండి.
 

ప్రి స్కూల్ విద్య కోసం
sudo apt-get install ubuntu-edu-preschool

ప్రైమరీ స్కూల్ విద్య
sudo apt-get install ubuntu-edu-primary

సెకండరీ స్కూల్ విద్య
sudo apt-get install ubuntu-edu-secondary

విశ్వ విద్యాలయాల విద్య
sudo apt-get install ubuntu-edu-tertiary

4, డిసెంబర్ 2010, శనివారం

ఉబంటు/లినక్స్ ఇంస్టాల్ చేసిన తర్వాత చెయ్యాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు

ఈ టపాలో తెలిపిన విధంగా చెయ్యుటకు మీరు మొదట టెర్మినల్‌ను తెరచి అందులో క్రింద తెలిపిన కమాండులను అతికించండి(paste).సాదారణంగా టెర్మినల్ లో కాపీ చేసిన టెక్స్ట్ షార్ట్ కట్ లో(ctrl +v) పేస్టు చెయ్యలేము అందుకనే రైట్ క్లిక్ ఉపయోగించి అతికించండి (paste). 
కమండులను ఒకదాని తర్వాత ఇంకొకకటి మాత్రమే చెయ్యండి (లైన్ బై లైన్)
ఉబంటులో బటన్లు ఎడమవైపు ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారా..
ఈ బటన్లు ఉబంటు 9.04 లో కుడివైపే ఉండేవి కాని ఆ తర్వాత వచ్చిన ఉబంటు 10.04 వర్షెన్లో ఎడమవైపునకు మార్చడం జరిగింది. దీనిని ఉబంటు 10.10లో కూడా కొనసాగించారు బహుశా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగించవచ్చు. మీకు కనుక ఇది ఇబ్బందిగా ఉంటే ఈ క్రింది పద్దతుల ద్వారా కుడివైపునకు మార్చుకునే అవకాసం ఉందండోయ్...(మీకు తెలుసు కదా లినక్స్ లో దేనినైనా మనకు నచ్చిన విధంగా మలచుకోవచ్చునని)
పద్ధతి 1
కుడి వైపుకు మార్చటానికి ఈ క్రింది కమాండ్ వాడండి.
gconftool -t string -s /apps/metacity/general/button_layout menu:minimize,maximize,close
ముందు ఉన్నట్టుగా బటన్‌లు కావాలంటే ఈ క్రింది కమాండ్ వాడండి.
gconftool -t string -s /apps/metacity/general/button_layout close,minimize,maximize:
పద్ధతి 2
ubuntu Tweak ఇంస్టాల్ చేసి ఉంటే దీని ద్వారా మార్చుకోవచ్చు.
ఉబంటు ట్వీక్ తెరచి
Desktop=> Window Manager Settings =>Window Titlebar Button Layout=>Right
పద్ధతి 3
Configuration Tool (System Tools=>Configuration Editor లేదా Terminal లో gconf-editor అని టైపు చెయ్యండి)తెరచి క్రింద తెలిపిన విధంగా చెయ్యండి.
apps=>metacity=>general=>button_layout మీద డబుల్ క్లిక్ చేసి క్రింది టెక్ట్ ను ప్రవేశపెట్టండి.
menu:minimize,maximize,close

మల్టిమీడియా సహకారాన్ని చేర్చండిలా...
మల్టిమీడియా వనరులను జోడించు.

sudo wget --output-document=/etc/apt/sources.list.d/medibuntu.list http://www.medibuntu.org/sources.list.d/$(lsb_release -cs).list
sudo apt-get --quiet update
sudo apt-get --yes --quiet --allow-unauthenticated install medibuntu-keyring
sudo apt-get --quiet update

ఎన్ క్రిప్ట్ చెయ్యబడిన డివిడిను ప్లే చెయ్యటానికి సహకారాన్ని చేర్చండి.
sudo aptitude install libdvdcss2

విండోస్ మల్టిమీడియా కోడెక్స్ ను ఇంస్టాల్ చెయ్యండి

మీది 32 బిట్ సిస్టం అయితే (సాదారణంగా అందరు వాడేది ఇదే..అనుకోండి)
sudo apt-get install w32codecs

మీది 64 బిట్ సిస్టం అయితే
sudo apt-get install w64codecs

ఉచితంగా లభ్యం కానీ కోడెక్ లను ఇన్స్టాల్ చేయ్యండి
sudo apt-get install non-free-codecs

వియల్సి ప్లేయర్ ను ఇంస్టాల్ చేసుకోండి.

వియల్సి లినక్సుకు ఒక మంచి మీడియా ప్లేయర్ ఇంచుమించు ప్రతీదానిని ప్లే చెయ్యవచ్చు.దీనిలో ఉన్న ప్రత్యేకతలు మరే ఇతర ప్లేయర్ లోను మీరు గమనించరు.
వియల్సి ప్లేయర్‌ను ఈ కమాండు ను టెర్మినల్ నందు టైపు చేసి ఇంస్టాల్ చేసుకోవచ్చు.
sudo apt-get install vlc

మీ ఉబంటుని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి.
కైరో డాక్

కైరో డాక్ అనేది యానిమేషన్ తో కూడిన ఒక డెస్క్టాపు సాప్ట్వేర్.ఎక్కువగా వాడే అప్లికేషన్ లను సులభంగా తెరవటానికి ఉపయోగపడే అనువర్తనం. ఇది మాక్ OS X లో గల డాక్ ను పోలి ఉంటుంది. దీనిని మీరు GNOME, KDE మరియు XFCE డెస్క్ టాప్ పర్యావరణాలలో నడుప వచ్చు.
sudo -v
echo "deb http://ppa.launchpad.net/cairo-dock-team/ppa/ubuntu $(lsb_release -sc) main ## Cairo-Dock-PPA-Stable" | sudo tee -a /etc/apt/sources.list
sudo apt-key adv --keyserver keyserver.ubuntu.com --recv-keys E80D6BF5
sudo apt-get update
sudo apt-get install cairo-dock cairo-dock-plug-ins

డాకీ


డాకీలో ధీమ్స్, ప్లగిన్స్ ,4 వివిధ రకాల హైడింగ్ మోడులు, ముందస్తు సూచికలు, విండో నిర్వాహణ ఇందులో గల కొ న్ని అద్భుతమైన ఫీచర్లు.డాకీ అనేది ముందస్తు అడ్డదారుల అనువర్తనాల బార్ దీనిని మీరు తెరచాపకు క్రింద గాని పైన లేదా ప్రక్కలలో పెట్టుకోవచ్చు.అంతే కాకుండా కొ న్ని ముఖ్యమైన దస్త్రాలు,ఫోల్డర్లకు మరియు అనువర్తనాలను సులభంగా తెరుచుటకు అవకాశాన్ని కల్పస్తుంది. ప్రస్తుతం నడుచుచున్న అనువర్తనాలను, మినిమైజ్ చేసిన విండోలను కూడా చూపిస్తుంది.
sudo add-apt-repository ppa:docky-core/ppa
sudo apt-get update && sudo apt-get install docky

మీ డెస్క్టాపుకు స్రీన్ లెట్స్ తగిలించండి


స్రీన్ లెట్స్ అనేవి చిన్న అనువర్తనాలు ఇవి వాడుకరులకు విషయ సూచికలుగా పని చేస్తాయి.అంటే సమయం(గడియారం), కాలెండర్, వాతావరణం, వ్యవస్థ సమాచారం...
sudo apt-get install screenlets

మైక్రోసాఫ్ట్ ఫాంట్స్
మైక్రోసాఫ్ట్ ఫాంట్లను మీ సిస్టం యందు ఇంస్టాల్ చెయ్యాలనుకుంటే....
sudo apt-get install msttcorefonts

వైన్ సాప్ట్వేర్
వైన్ అనేది ఒక సాఫ్ట్వేర్ దీని ద్వారా మీరు విండోస్ XP, Vista, 7లో వాడే సాఫ్ట్వేర్లను లినక్స్ లో నడుపవచ్చు.
sudo add-apt-repository ppa:ubuntu-wine/ppa
sudo apt-get update
sudo apt-get install wine

విండోస్ ఎమ్యులేటర్స్: ప్లే ఆన్ లినక్స్


మైక్రోసాఫ్ట్ విండోస్ కోసం తయారు చెయ్యబడిన సాఫ్ట్వేర్లు, గేమ్స్ ను PlayOnLinux ద్వారా సులువుగా ఇంస్టాల్ చేసుకోవచ్చు.
sudo apt-get install playonlinux

ఉబంటు ట్వీక్


ఉబంటు ట్వీక్ అనేది లినక్స్ లో తప్పనిసరి కలిగి ఉండాల్సిన అనువర్తనాలలో ఒకటి. దీనితో మీరు మీ డెస్క్ టాప్ మరియు వ్యవస్థ నందు ఐఛ్చికాలను మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు.
sudo add-apt-repository ppa:tualatrix/ppa
sudo apt-get update
sudo apt-get install ubuntu-tweak

7 జిప్
7-జిప్ సాఫ్ట్వేర్ ఉపయోగించి దస్త్రాలను అతి తక్కువ సైజులో కుదించవచ్చు.అంతే కాకుండా కుదించిన వాటికి సంకేత పదం కూడా పెట్టుకోవచ్చు.
sudo apt-get install p7zip-full

27, నవంబర్ 2010, శనివారం

‘లినక్స్’ధే లోకం

 ‘జురాసిక్ పార్క్’ చిత్రం గుర్తుందా? అలనాడు యువతనే కాదు అన్నిరకాల ప్రేక్షకులకూ ఒక ‘కిక్’ ఇచ్చిందీ చిత్రం. దానికి కారణం అందులో వాడిన గ్రాఫిక్స్, ఆనిమేషన్‌లే. ఈ సినిమా తర్వాతే దాదాపు అన్ని చిత్రాల్లోనూ (అసరం ఉన్నా, లేకున్నా) అంతో ఇంతో గ్రాఫిక్స్ జొప్పించటం ఆరంభమైంది. అంతలా ‘సినీ’ నిర్మాణాన్నే ప్రభావితం చేసిన జురాసిక్ పార్క్ చిత్రంలోని గ్రాఫిక్స్, ఆనిమేషన్ అంతా రూపుదిద్దుకొన్నది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘లినక్స్’లోని సాఫ్ట్వేర్లతోనే..! ఆశ్చర్యంగా ఉంది కదూ! నిజం!


1991లో లినస్ టోర్వాల్డ్స్ అనే ‘ఫిన్‌లాండ్’ దేశ ప్రోగ్రామర్ రూపొందించడం, ఆ తర్వాత 12 ఏళ్ళల్లో కంప్యూటర్ రంగంలో కొత్త వివాదాలకూ, వ్యాపార అవకాశాలకూ కేంద్రబిందువైంది ‘లినక్స్’. హాబీగా, సరదాగా తయారు చేసుకొన్న ఆపరేటింగ్ సిస్టం ‘లినక్స్’. నేడు ఎందరెందరినో అలరిస్తోంది. ఐబిఎం, హెచ్‌పి, ఇంటెల్ వంటి సంస్థల అండదండలతో ఎదురులేని ఆపరేటింగ్ సిస్టమ్‌గా ఎదిగింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా 2వేల దశకంలో వెలుగులోకి వచ్చి ప్రాచుర్యాన్ని పొందడానికి కారణాలు బోలెడు. ఆర్థికరంగ పరిస్థితితో అప్పటికే వివిధ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకు పోవడంతో ఖర్చులు తగ్గించుకొని లాభాల బాటలో పయనించాలంటే ‘ఓపెన్ సోర్స్ గతి’ అని భావించారు. దాంతోబాటు ఆపరేటింగ్ సిస్టం, సాఫ్ట్వేర్స్ వీటిపై బడ్జెట్ ఖర్చులను తగ్గించుకోవాలని వివిధ కార్యాలయాలూ, కార్పొరేట్ సంస్థలూ ‘లినక్స్’ వైపే మొగ్గు చూపనారంభిచాయి. ఇంటెల్ సంస్థ కూడా ‘లినక్స్’కు ఉన్న సత్తాను గుర్తించి దాన్ని సపోర్టు చేసే రీతిలో ప్రొఫెసర్లను తయారు చేయడం ద్వారా సపోర్టు నివ్వడంతో ‘లినక్స్’ ఎదగుదల సాధ్యమైంది. ఫెడోరా, రెడ్‌హేట్, ఓపెన్ స్యూజ్, ఉబుంటు వంటి సంస్థలు ‘లినక్స్’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నాయి. వీటిపై సమగ్రమైన డాక్యుమెంటేషన్, ఆపరేషన్స్, డౌన్‌లోడింగ్ సౌకర్యాలు ఇప్పటికీ వారివారి వెబ్ సైట్లలో లభ్యమే. ఎందుచేతనో రెడ్‌హేట్ సంస్థ ఇటీవల ధోరణి మార్చి కొంత వ్యాపారాత్మక వ్యూహాన్ని అనుసరించడంవల్ల ‘ఫ్రీ’ సర్వీసులు పరిమితమైపోయాయి. నేడు సర్వత్రా ఉబుంటు లినక్స్ బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. లినక్స్‌మీద ఫోరమ్స్‌లో కూడా చర్చించుకున్నారంతా. లినక్స్‌కు అలనాడు అందర్నీ అలరించిన యునిక్స్ ఆపరేటింగ్ సిస్టం మూలమనే విషయాన్ని గమనించాలి! యునిక్స్ అలనాడు ఆసియా దేశాల్లో, ముఖ్యంగా ఇండియాలో బాగా వాడేవారు కూడా. మెయిన్ ఫ్రేమ్‌లలో కూడా యునిక్స్, దాని రూపాంతరాలూ కొన్ని లభ్యమయ్యేవి. చక్కగా పనిచేయడం, వైరస్‌ల గోల లేకుండా ఉండటం, ఎప్పటిపకప్పడు తాజా అప్‌డేట్స్ నెట్‌లో దొరుకుతుండటం, అన్నిటినీ మించి సమస్యలు తక్కువగా ఉంటూ, ఉచితంగా లభించడం ‘లినక్స్’ విజయ రహస్యం.

వనరు: ఆంధ్రభూమి
లినక్స్ మీద మరింత సమాచారం కోసం ఈ లంకెలను దర్శించండి.

ఎంఎస్‌ ఆఫీస్‌కు ధీటుగా ఓపెన్‌ ఆఫీస్‌


 కంప్యూటర్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆఫీస్‌ సూట్‌ను ఉపయోగిస్తూనే వుంటారు. వర్డ్ ఫైల్స్ దగ్గర నుండి డేటా బేస్‌ తయారీ వరకు అనేక రకాల పనులకు సంబంధిత సాఫ్ట్వేర్స్ అందుబాటులో వున్నాయి. ఆఫీస్‌ సూట్‌ అనగానే ఎక్కువమంది ఠక్కున చెప్పేది మైక్రోసాఫ్ట్ఆఫీస్‌ (ఎం.ఎస్‌.ఆఫీస్‌) గురించే. కానీ మైక్రోసాఫ్ట్ఆఫీస్‌ సూట్‌ను తలదన్నేరీతిలో ఈమధ్యకాలంలో అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చిన ఆఫీస్‌ సూట్‌ 'ఓపెన్‌ ఆఫీస్‌'. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో కూడా లేనటువంటి అద్భుతమైన ఫీచర్లతో మైక్రోసాఫ్ట్ కు  ధీటైన సవాల్‌ విసురుతోంది  ఓపెన్‌ ఆఫీస్‌. ఆ వివరాలు...

ఆఫీసు అవసరాలకు వాడే సాఫ్ట్‌వేర్‌ని ఆఫీస్‌ సూట్‌ అంటారు. ఒక సాధారణ ఆఫీస్‌ సూట్‌లో వ్యాసాలు, ప్రజెంటేషన్లు, కంపెనీ ఖాతాలు, డేటా బేస్‌ వంటి అనేక పనులు నిర్వహించవచ్చు. అన్ని ఆఫీస్‌ సూట్లలోనూ ఎక్కువగా వాడే మైక్రోసాఫ్ట్ఆఫీస్‌లో వ్యాసాలు రాయటానికి వాడే సాఫ్ట్‌వేర్‌ని మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటారు. మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఒక వ్యాసాన్ని రాసి ఫైలును భద్రపరిస్తే ఆ ఫైల్‌ను 'వర్డ్ డాక్యుమెంట్‌' అంటారు. వర్డ్ డాక్యుమెంట్‌లో మనం రాసిన వ్యాసం రహస్య పద్ధతిలో భద్రపరచి వుంటుంది. దీనిని ఏ పద్ధతిలో మైక్రోసాఫ్ట్‌వారు భద్రపరిచారో మైక్రోసాఫ్ట్ వారికి తప్ప మరెవరికీ తెలియదు. ఈ పద్ధతిని వారు ఎవరికీ చెప్పరు. ఈ సాఫ్ట్‌వేర్లలో తప్ప మరే సాఫ్ట్‌వేర్‌లోనూ ఈ వ్యాసాన్ని చదవలేరు. కనుక మన సమాచారం మొత్తం అమెరికాలోని ఒక కంపెనీ గుప్పెట్లో వుంటుందన్నమాట. మైక్రోసాఫ్ట్‌వారు డాక్యుమెంట్లను దాచే విధానాన్ని అవసరం లేకపోయినా తరచూ మార్చేస్తుంటారు. ఇప్పటికి 'మైక్రోసాఫ్ట్ఆఫీస్‌ -40, 95, 98, 2000, XP, 2003, 2007, 2010' వరకు విడుదలయ్యాయి. వీటన్నిటిలోనూ వర్డ్ డాక్యుమెంట్లు దాచే విధానం మారిపోతూ వచ్చింది.


దీనివల్ల ఒక వెర్షన్లో వున్న వ్యాసం మరో వెర్షన్‌లో చదవడం కష్టమవుతుంది. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వారు కొత్త వెర్షన్‌ విడుదల చేసిన ప్రతిసారీ పెద్దమొత్తంలో డబ్బులు వెచ్చించి కొనాల్సి వుంటుంది. అంతేకాకుండా ఈ వర్డ్ డాక్యుమెంట్ల ద్వారా వైరస్‌ కూడా సులువుగా వ్యాప్తి చెందుతుంది. అందువల్లనే చాలావరకు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్లపై ఆధారపడకుండా ఫ్రీ సాఫ్ట్‌వేర్లను వాడుతున్నారు. ఇక్కడ ఫ్రీ అంటే 'ఉచిత' అని కాకుండా 'స్వేచ్ఛ' అని అర్థం వస్తుంది. ఈ ఫ్రీ సాఫ్ట్‌వేర్లను మైక్రోసాఫ్ట్ వారిలా కాకుండా మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఎవరికైనా ఉచితంగా ఇవ్వవచ్చు. మైక్రోసాఫ్ట్ఆఫీసును పోలివుండే ఈ సాఫ్ట్‌వేర్‌లో నేరుగా పిడిఎఫ్‌ చేసుకునే అవకాశం వుంది. ఆప్షన్స్ బార్‌లోని 'ఎక్స్‌పోర్ట్ పిడిఎఫ్‌' అనే బటన్‌పై క్లిక్‌ చేసి నేరుగా పిడిఎఫ్‌ చేసుకోవచ్చు. డ్రా అనే వెక్టార్‌ గ్రాఫిక్స్ సాఫ్ట్‌వేర్‌ లాంటివి అదనపు ఆకర్షణలు.


దీనిని http://download.openoffice.org/index.html నుండి డౌన్లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేయాలి. ప్రోగ్రామ్స్ ఫోల్డర్‌లో 'ఓపెన్‌ ఆఫీస్‌.ఆర్గ్' పేరుతో ఓ ఫోల్డర్‌ క్రియేట్‌ అవుతుంది. అందులో ఈ సూట్‌లో వుండే ఆరు సాఫ్ట్‌వేర్ల జాబితా కనబడుతుంది. అందులోనుండి మనకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను డైరెక్ట్‌గా ఓపెన్‌ చేసుకోవచ్చు. లేదా అదే లిస్టులో  పైన కనిపించే 'ఓపెన్‌ఆఫీస్‌.ఆర్గ్'ను సెలెక్ట్‌ చేసుకొని ఓపెన్‌ చేసుకుంటే చిత్రంలో కనిపించే విధంగా ఐకాన్లతో కూడిన పేజీ తెరుచుకొంటుంది. అందులో మనకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఆ ఐకాన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తెరవవచ్చు.


ఓపెన్‌ ఆఫీస్‌ రైటర్‌ : ఇది ఎం.ఎస్‌.వర్డ్  మాదిరిగా పనిచేస్తుంది. చాలా తేలికగా దీనిని ఉపయోగించవచ్చు. దీని ఆఫీస్‌ సూట్‌లోని మరో సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళాలన్నా ఆప్షన్‌బార్‌ మొదట్లో వుండే 'న్యూ' అనే బటన్‌పై క్లిక్‌చేసి వచ్చే
లిస్టులో ఏదికావాలో ఎంపిక చేసుకోవచ్చు.

ఓపెన్‌ ఆఫీస్‌ స్ప్రెడ్ షీట్ : విండోస్‌లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌ ఏ రకంగా ఉపయోగపడుతుందో అంతకంటే మెరుగైన సౌకర్యాలతో ఈ
కాల్ సి ఉపయోగపడుతుంది. స్ప్రెడ్‌ షీట్‌లో సమాచారాన్ని తీసుకొని, గణిత సంబంధమైన లెక్కలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇచ్చిన సమాచారాన్ని చార్టుల రూపంలోనూ, గ్రాఫుల రూపంలోనూ చిత్రీకరించవచ్చు. దీనిని ఉపయోగించి మనకు కావలసిన సమాచారాన్ని గణనం చేసి, విశ్లేషించవచ్చు. దీనిలోని గణాంక, బ్యాంకు, వ్యాపార సంబంధమైన ఆదేశాల (ఫంక్షన్స్)ను ఉపయోగించి సూత్రాలను కొనుక్కోవచ్చు. ఈ సూత్రాల సహాయంతో మనం అతి క్లిష్టమైన లెక్కింపుల సమస్యలను పరిష్కరించవచ్చు.

ఓపెన్‌ ఆఫీస్‌ ఇంప్రెస్‌ : ఎం.ఎస్‌.ఆఫీస్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ మాదిరి ఉపయోగపడుతుంది. ప్రజెంటేషన్‌ అనేది కొన్ని స్లైడ్స్ లేదా కొన్ని పేజీల సముదాయం. పేజీలలో లేదా 
స్లైడ్స్ లో బొమ్మలు, టేబుల్స్, గ్రాఫ్స్ తదితర సమాచారాన్ని ఎదుటివారికి సులభంగా విశదీకరించేందుకు, మన భావాలను సులభంగా వ్యక్తీకరించేందుకు ఈ ప్రజెంటేషన్లు ఉపకరిస్తాయి. రకరకాల బ్యాక్‌గ్రౌండ్‌ డిజైన్లతో కూడిన ఈ పేజీలను స్లైడ్స్ రూపంలో ఒక్కసారి ఆర్గనైజ్‌ చేయడం తెలిస్తే ఇక ఏదైనా ప్రజెంటేషన్‌ రూపంలో చేయగలుగుతారు.

ఓపెన్‌ ఆఫీస్‌ బేస్‌ : ఎం.ఎస్‌.యాక్సెస్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది. దీనిని యాక్సెస్‌ కంటే మెరుగైన, సురక్షితమైన డేటాబేస్‌ను తయారుచేసుకోవచ్చు.


ఓపెన్‌ ఆఫీస్‌ మ్యాథ్స్: ఎం.ఎస్‌.ఆఫీస్‌లో ఈ రకమైన ఫీచర్‌లేదు. దీనిని ఉపయోగించి లెక్కలకు సంబంధించిన అనేక ఫార్ములాలను తయారు చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.


ఓపెన్‌ ఆఫీస్‌ డ్రా : ఈ రకమైన ఫీచర్‌ ఎం.ఎస్‌.ఆఫీస్‌లో లేదు. దీని
లో ఉపయోగించి వెక్టార్‌ డ్రాయింగ్స్ క్రియేట్‌ చేయవచ్చు.




ఓపెన్‌ ఆఫీస్‌ ప్రత్యేకతలు

ఇది పూర్తిగా ఉచితం. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్‌ఆఫీస్‌.ఆర్గ్ నుండి డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. ఎలాంటి లైసెన్స్‌ ఫీజు చెల్లించనవసరంలేదు. వ్యక్తిగత, కార్యాలయ ఇతర అవసరాల కోసం స్వేచ్ఛగా వాడుకోవచ్చు. దీని కాపీలను ఇతరులకు పంపిణీ చేయవచ్చు. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త ఓపెన్‌సోర్స్ సముదాయానికి సలహాలు పంపవచ్చు. అనేక రకాలైన
హార్డువేర్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్ అయిన మైక్రోసాఫ్ట్ విండోస్‌, మ్యాక్‌, లినక్స్, సన్‌ సోలారిస్‌ల మీద పనిచేస్తుంది. అనేక భాషలను సపోర్టు చేస్తుంది. సుమారు 40 భాషల డిక్షనరీలు, స్పెల్లింగులు మొదలైన సౌకర్యాలున్నాయి.

ఓపెన్‌ ఆఫీస్‌ ప్రస్తుతం అను ఫాంట్స్ వంటి తెలుగు ఫాంట్స్‌కు సపోర్టు చేయడంలేదు. అయితే యూనికోడ్‌ ఫాంట్స్‌ను నిక్షేపంలా వాడుకోవచ్చు. పైసా ఖర్చులేకుండా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లను ఉచితంగా డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. మరెందుకాలస్యం  http://openoffice.org ను సందర్శించి డౌన్లోడ్‌ చేసుకోవడమే తరువాయి.



17, నవంబర్ 2010, బుధవారం

ఓపెన్ సోర్సే బెటర్



నేడు కంప్యూటర్ లేనిదే క్షణమైనా గడవటం లేదు. పాతకాలంలో ఒక వాల్వు రేడియో కొంటే దాన్ని పదికాలాలపాటు వాడేవారు. ఆధునిక ప్రపపంచంలో ఆ పరిస్థితి లేదు. అంతా ఆరునెల్లే. ప్రతిరోజూ కొత్త పరిజ్ఞానం మార్కెట్‌లోకి వస్తోంది. ఇది సాఫ్ట్వేర్‌కూ మినహాయింపేమీ కాదు. వేలకు వేలు పోసి ఒక సాఫ్ట్వేర్ కొంటే, దానికి మరో వెర్షన్ ఆరు నెలల్లో ప్రత్యక్షం. మనం కొత్త సాఫ్ట్వేర్ను వాడకపోతే ఔట్‌డేట్ అయిపోయినట్టే. దీనివల్లే హెచ్చుశాతం ప్రజలు ‘పైరసీ’కి దోహదపడుతున్నారు. సాఫ్ట్వేర్ కాపీ చేసి వాడటం తప్పేకాదు. నేరం కూడా! మరిదీనికి పరిష్కారం లేదా? అంటే ఉంది. అదే ‘ఓపెన్ సోర్స్’. అంటే అంతా బహిరంగంగానే లభించడం. అదీ ఉచితంగా. దానికి సోర్స్ కోడ్ కూడా లభిస్తుంది. కేవలం మనం ఒక సాఫ్ట్వేర్ను వాడటమే కాక, కావలిస్తే దానికి మరిన్ని ఫీచర్లు జోడించడమో, ఉన్న సమస్యను పరిష్కరించడమో చేసి, దానిని తిరిగి అందరికీ అందుబాటులో తేగల్గడం ‘ఓపెన్ సోర్స్’ ప్రత్యేకత. వాణిజ్యపరంగా లభించే ఆఫీస్ సూట్‌ల నుంచీ ఫోటోలు ఎడిటింగ్, ప్రజంటేషన్ సాప్ట్వేర్లే కాదు, ఆపరేటింగ్ సిస్టమ్‌లూ, డేటాబేస్ సిస్టమ్‌లూ- ఏ రకమైన సాఫ్ట్వేర్ అయినా సరే! ఓపెన్ సోర్స్ ప్రత్యామ్నాయం వుంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను వాడుకోవడానికి ఎలాంటి పరిమితులూ, పర్మిషన్లూ అక్కర్లేదు. 1983లో రిచర్డ్స్ మాథ్యూస్ స్టాల్‌మాన్ ఆరంభించిన ఫ్రీ సాఫ్ట్‌వేర్ స్ఫూర్తితో 1998లో ఓపెన్ సోర్స్ ఉద్యమ రీతిలో వెలుగులోకి వచ్చింది. 1999లో ‘స్టార్ ఆఫీస్’ పేరుతో అమ్మకాలు సాగించిన సన్‌మైక్రో సంస్థ దానిని ఉచితంగా, ఓపెన్ సోర్స్ కింద ఓపెన్ ఆఫీస్, ఓఆర్‌జి పేరుతో అందుబాటులోకి తేవడంతో ఊపునందుకొంది. స్పెయిన్ లాంటి దేశాల్లో ఓపెన్ సోర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్ల ఆధారంగా శిక్షణనివ్వడమే కాదు, ఆయా సాఫ్ట్వేర్లను ఈ-గవర్నెన్స్ చొరవల్లో వాడుతున్నారు. భారతదేశంలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వాడటం మొదలైంది.
ఓపెన్ సోర్స్
సాఫ్ట్వేర్లను అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలూ వాడి ఈ-గవర్నన్స్ అమలు చేస్తే, ఆర్థికంగా, ఎంతో లబ్ధి చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఓపెన్ సోర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్లు అటు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ, ఇటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోనూ కూడా పనిచేసేలా దొరుకుతాయి. ఆఫీస్ సూట్స్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, హెచ్‌టిఎంఎల్ ఎడిటర్స్, టెక్స్ ఎడిటర్స్, ఫోటో ఎడిటర్స్, యానిమేషన్ టూల్స్, ఈ-మెయిల్ క్లయింట్స్, ఇంటర్నెట్ బ్రౌజర్స్, ఎఫ్‌టిపీ క్లయింట్స్, వెబ్ సర్వర్స్, కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఆఖరికి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. వైజ్ఞానిక, సాంకేతిక పరమైన సాఫ్ట్వేర్లూ ఉన్నాయి. ఆడియో, వీడియో సాఫ్ట్వేర్ల గురించి చెప్పనక్కర్లేదు. ఇఆర్‌పి, క్యాడ్, క్యామ్ రంగాల్లో కూడా ఎన్నోసాఫ్ట్వేర్లూ ఉన్నాయి.
మన ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులన్నీ ఓపెన్ సోర్స్ ఆధారంగా రూపొందితే కొన్నివేల కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. దానిని ప్రజా సంక్షేమానికి వాడొచ్చు. ఈ రీతిలో మన మేథావులూ, ప్రభుత్వాలూ ఆలోచిస్తే ఎంత బావుంటుందో! కదా!

ఓపెన్ సోర్సు... అపోహలేల...?

ఏదన్నా సరే ఫ్రీ అంటే ఇట్టే ఎగరేసుకుపోయే వారూ ఉన్నారు. ఉచితం! అంటే లోకువ కట్టేసే వారూ లేకపోలేదు. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌లను ఇట్టే ఎగరేసుకుపోకుండా అపోహలు సృష్టించేవారే అధికం! ముఖ్యంగా యూజర్స్‌కీ, కస్టమర్స్‌కీ ఉండే పరిజ్ఞాన, విజ్ఞాన సమాచారాలు తక్కువ. ఈ బలహీనతను ఆసరా చేసుకుని కొన్ని వ్యాపార సంస్థలు ఓపెన్ సోర్సు గురించి వ్యతిరేక భావనలు కల్పించడంలో సక్సెస్ అవుతున్నారు. అందువల్ల ఓపెన్ సోర్స్ గురించిన అపోహలు తొలగించుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది.
ఐటి రంగంలో ఓపెన్ సోర్సుకి స్థానం లేదు. కేవలం నేర్చుకోవడానికి విద్యార్థులు కళాశాల గదులకే పరిమితం- అని చాలామంది అంటుంటారు. అది శుద్ధ తప్పు. నేడు ఓపెన్ సోర్సు సాఫ్ట్‌వేర్‌లైన లినక్స్, అపాచి వెబ్ సర్వర్, జావా లాంగ్వేజ్- ఇలాంటివెన్నో ఐటి రంగంలో విస్తృతంగా వాడుతున్నారు.
కీలకమైన (మిషన్ క్రిటికల్) ఈ-గవర్నెన్స్ అప్లికేషన్స్‌కు పనికిరాదనీ ఒక అపోహ ఉంది. నేడు ఎన్నో దేశాల్లో ఈ-గవర్నెన్స్ అప్లికేషన్లు ఓపెన్ సోర్స్ నుంచి వాడటంవల్ల కోట్లాది రూపాయలను ఆదా చేసుకుంటున్నాయి. ఓపెన్ సోర్స్ సంస్థలకు స్వతహాగా వారి మేధోవాక్కులు ఉండవు -ఇదీ అపోహే. ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్ సంస్థలకు కాపీరైట్ హక్కులెలా ఉంటాయో, ఓపెన్ సోర్స్ సంస్థలకూ ఉంటాయి. వాణిజ్యపరమైన సంస్థల్లా, ఓపెన్ సోర్స్ సంస్థలు నియంతృత్వ ధోరణిని అవలంబించవు. ఓపెన్ సోర్స్ పరిజ్ఞానం ప్రొప్రయిటరీ టైపు సపోర్టునివ్వదు -ఇదీ అపోహే. కస్టమర్ సపోర్టు పేరున డబ్బులు వసూలు చేసి సపోర్టునిచ్చేవి వ్యాపార సంస్థలు. నిజానికి ఓపెన్‌సోర్స్‌లో లభిస్తున్నంత చక్కని డాక్యుమెంటేషన్, ప్రొఫెషనల్ సపోర్ట్, మరే వాణిజ్యపరమైన సాఫ్ట్‌వేరూ ఇవ్వడం లేదు. ఓపెన్ సోర్సులో నియంత్రణ లేదు. ఎవరైనా మార్చొచ్చు. ఇది ఓపెన్ సోర్స్ అంటే తెలీనివారు చేసే ప్రచారం. ఎలాపడితే అలా సోర్సుకోడ్‌ను మార్చడానికి వీలులేదు. ఎలాంటి కోడ్ మార్పులు జరిగినా, అవి కేవలం ‘బగ్’ (ఎర్రర్) తొలగింపునకు చెందినదే ఉంటాయి. ఓపెన్‌సోర్స్ సేఫ్ కాదని అందరూ అంటుంటారు. ఓపెన్‌సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసేస్తారనేది కేవలం అపోహే. ఓపెన్ సోర్స్ ప్రమాణాలు ఉన్నతమైనవీ, సురక్షతమైనవీను!

వనరు: ఆంధ్రభూమి

16, నవంబర్ 2010, మంగళవారం

ఉబుంటులో మల్టిమీడియా సహకారాన్ని చేర్చండిలా...

ఉబుంటు 10.04 LTS (lucid lynx) లో mp3 లేదా DVD వీడియో ప్లే బ్యాక్ లేదా రికార్డు చెయ్యలేము, ఎందుకంటే mp3 ఫార్మట్సు పేటెంట్ హక్కులు కలిగివున్నాయి, ఆ హక్కులు కలిగివున్నవారు కావలసిన లైసెన్సులను ఏ ఇతర సంస్థలకు ఇవ్వలేదు.అందువల్ల ఉబుంటు 10.04 LTS (lucid lynx) లో మల్టిమీడియా సాఫ్ట్వేర్ను పెట్టలేదు ఎందుకంటే పేటెంట్, నకలుహక్కులు లేదా లైసెన్సు పరిమితులు వల్ల.దీని అర్ధం మీరు .mp3 దస్త్రాలను ఉబుంటు 10.04 LTS (lucid lynx)లో  ప్లే చెయ్యలేరని కాదు.కాకపోతే మీరు దీనికి ఒక చిన్న పని చెయ్యాలి అంతే...


కింద తెలిపిన సూచనలు ద్వారా మీరు .mp3 మరియు ఇతర మల్టిమీడియా సహకార దస్త్రాలను ప్లే చెయ్యవచ్చు.
ఈ సూచనలను టెర్మినల్ లో కమాండ్స్ ద్వారా చెయ్యాలి, ఈ కమాండ్స్ వాడేటప్పుడు "$ " ఈ గుర్తును మినహాయించడం (exclude) మర్చిపోకండి సుమా లేకపోతే దోషం చూపిస్తుంది.


$ sudo wget --output-document=/etc/apt/sources.list.d/medibuntu.list http://www.medibuntu.org/sources.list.d/$(lsb_release -cs).list
$ sudo apt-get --quiet update
$ sudo apt-get --yes --quiet --allow-unauthenticated install medibuntu-keyring
$ sudo apt-get --quiet update



పైన ఇచ్చిన వనరులను జోడించిన తరువాత కోడెక్ లను ఇన్స్టాల్ చెయ్యండి


ఉచితంగా లభ్యం కానీ కోడెక్ లను ఇన్స్టాల్ చేయ్యండిలా...


$ sudo apt-get install non-free-codecs


డివిడి మీడియా సహకారం ఈ కమాండ్ ద్వారా పొందండి


$ sudo apt-get install libdvdcss2


విండోస్ కోడెక్స్


$ sudo apt-get install w32codecs


వియల్సి మీడియా ప్లేయర్ ను పొందండిలా...


$ sudo apt-get install vlc mplayer

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

అత్యంత ప్రజాదరణ పొందిన లినక్స్ పంపకాలు

అత్యంత ప్రజాదరణ పొందిన లినక్స్ విస్తరణలు

లినక్స్ లో చాలా రకాలు ఉన్నాయి సుమారుగా ౩౦౦ కానీ వీటిలో ముఖ్యమైన మరియు ప్రజాదరణ పొందినవి మాత్రం కొన్ని ఉన్నాయి వీటి ఫై ఆధారపడి కొన్ని ఇతర రకాలు కూడా పనిచేస్తున్నాయి.అవే డెబియన్, రెడ్ హాట్,ఓపెన్ స్యుస్.
డెబియన్ లో పాకేజ్ ఫైళ్లు .deb ఫార్మేట్ లో ఉంటే రెడ్ హాట్ లో .rpm (Redhat Package Manager)లో ఉంటాయి. అంటే విండోస్ లో .exe  ఫైల్స్ లాగా అన్నమాట.
      ముందుగా డెబియన్ గురించి మాట్లాడుకుందాం, డెబియన్ లినక్స్ వెనుక చాలామంది అభివృద్ధి చేసేవారి కృషి ఉంది.ఏ ఇతర లినక్స్ లోను అందించని పాకేజ్ లను ఇందులో పొందవచ్చు. 25,000 వేలకు ఫైచిలుకు పాకేజ్ లు లభ్యమవుతాయి.
      ఇక రెడ్ హాట్ విషయానికి వస్తే దీనిని ఇప్పుడు ఎక్కువగా అంతర్జాల అల్లికలకు వాడుతున్నారు అంటే సర్వర్లు కోసం వినియోగిస్తున్నారు అంటే కమర్షియల్ వినియోగం అన్నమాట.దీని అర్ధం డెస్క్టాపు అవసరాలకు పనికిరాదని కాదు.డెబియన్ తో పోలిస్తే దొరికే పాకేజ్ లు తక్కువనే చెప్పాలి.

డెబియన్ మరియు దానిపైన ఆధారపడిన ఇతర పంపకాలు:
డెబియన్ లినక్స్ ఒక సంపూర్ణమైన ఆపరేటింగ్ వ్యవస్థగా చెప్పుకోవచ్చు అత్యధిక పాకేజ్ లతో లభ్యమవుతున్న ఏకైక లినక్స్ డెబియన్.చాలా మట్టుక్కు అంతర్జాలంతో పనిలేకుండా కేవలం సిడి లేదా డివిడి లతోనే అన్ని పాకేజ్ లను ఇన్స్టాల్ చెయ్యవచ్చు.డెబియన్ ను అయిదు లేదా ఆరు డివిడి లలో లభ్యమవుతుంది.డెబియన్ ను ఇన్స్టాల్ చెయ్యటానికి ఆ అయిదు డిస్క్ లలో మొదటి డివిడి లేదా సిడి ఒక్కటి చాలు.దీనిలో సాధారణంగా కావలసిన అన్ని సాఫ్ట్వేర్ లు ఉంటాయి కానీ అప్ డేట్స్ ఇంకా ఇతర సాఫ్ట్వేర్ లు కావాలంటే మిగిలినవి అవసరమవుతాయి.
డెబియన్ లో పాటశాల విద్య కొరకు ఒక విస్తరణ వున్నది అదే డెబియన్ ఎడు లేదా స్కోల్ లినక్స్.

డెబియన్ లినక్స్ మీద ఆధారపడి పనిచేస్తున్నా ఒక ముఖ్యమైన పంపకమే ఉబుంటు లినక్స్.ఉబుంటు లినక్స్ చాలా ఆకర్షణీయమైన ఇంటర్ఫేసు కలిగిఉండి ఇట్టే ఆకర్షించే రీతిలో దీన్ని తీర్చిదిద్దారు.ఇది ఒక సాదారణ కంప్యూటర్ వినియోగదారుడికి కావాల్సిన అన్నిటిని ఒక సిడిలో పొందవచ్చు.దీనిని సులువుగా ఇన్స్టాల్ చేసుకోవడమే కాకుండా ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా దీనిని ఉపయోగించవచ్చు.దీనినే లైవ్ సిడిగా పిలుస్తారు.ఉబుంటు ని ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా విడుదల చేస్తారు ఒకటి ఏప్రిల్ లో మరల అక్టోబర్ లో.
ఉబుంటు లోనే కొన్ని రకాలు ఉన్నాయి అవి కుబుంటు, ఎడుబుంటు , క్సుబంటు, ఉబుంటు స్టూడియో, ఉబుంటు ఎంటర్ ప్రైజ్ ఎడిసన్.

ఉబుంటు గనోమ్ ఇంటర్ఫేసు ను కలిగి ఉంటుంది కానీ కుబుంటు కెడియి ఇంటర్ఫేసు తో వస్తుంది. కెడియి ఇంటర్ఫేసు విండోస్ లాగా వుంటుంది.ఎడుబంటు విషయానికి వస్తే దీనిని విద్య కొరకు రూపొందించినారు.దీనిలో విద్యకి సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్ లను పొందవచ్చు.కుబుంటు లినక్సు కూడా చూడటానికి చాలా బాగుంటుంది.
ఉబుంటు స్టూడియోని ప్రత్యేకంగా ధ్వని, చిత్రాలు మరియు గ్రాఫిక్స్ వాడుటకు రూపొందించారు.
ఉబుంటు సర్వర్ ఎడిసన్ ను కేవలం సర్వర్ లు మరియు కమర్షియల్ ఉపయోగానికి వాడుతున్నారు.
క్సుబంటును చాలా తేలికగా పనిచేసేవిదంగా రూపొందించారు మరియు దీనిని కాన్ఫిగ్రేసన్ తక్కువ కంపూటర్లలలో కూడా వాడవచ్చు.

ఉబుంటు పై కూడా ఆధారపడి కొన్ని పంపకాలు పనిచేస్తున్నాయి అందులో లినక్స్ మింట్ ఒకటి దీనిలో కూడా నాలుగు రకాలు (GNOME, KDE, LXDE, Xfce  డెస్క్టాపు పర్యావరణాలు)ఉన్నాయి ఉబుంటులో వాటి మాదిరి.అన్ని లినక్స్ ఆపరేటింగ్ సిస్టంల కన్నా ఇదే అతి సులువైనది లినక్స్, మొదటిసారి వాడలనుకునేవారికి ఇది బాగుంటుంది.ఇబ్బందులేవీ లేకుండా సులబంగా వాడే రీతిలో దీనిని రూపొందించారు.
రెడ్ హాట్ ఇప్పుడు కేవలం అడ్వాన్స్డ్ సర్వర్లుగా కార్య నిమిత్తం వాడబద్తున్నది.అందువల్ల దీనిని ప్రస్తుతం ఉచితంగా అందించుట లేదు కానీ డెస్క్టాపు మరియు ఇతర వినియోగరులకు ఫెడోరా ను తయారు చేసారు రెడ్ హాట్ వారు.దీనిని మనం ఉచితంగానే పొందవచ్చు.ఇది కూడా ఒక ముఖ్య పంపకం.రెడ్ హాట్ మీద పనిచేస్తున్న ఇతర పంపకాలలో మాండ్రివా కూడా చెప్పుకోదగినదే.

ఓపెన్ స్యూజ్ లినక్స్ డెబియన్ మరియు రెడ్ హాట్ ల తర్వాత చెప్పుకోదగిన లినక్స్ పంపకం.దీనిని మొదట్లో స్యూజ్ లినక్స్ గా విడుదల చేసినా ఆ తర్వాత ఓపెన్ స్యూజ్ గా రూపాంతరం చెందింది.
సెంట్ ఓఎస్ రెడ్ హాట్ కు మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు ఉచితంగా సర్వర్ వాడుకోవలునుకుంటున్నవారు దీనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

ఈ టపాలో వివరించిన లినక్స్ పంపకాల లంకెలు.

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం మరియు దాని చరిత్ర



ఉచిత సాఫ్ట్వేర్ గురించి చెప్పే ముందు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైనది ఏమిటంటే అసలు సాఫ్ట్వేర్ అంటే ఏమిటి..?
 
కంప్యూటర్ సాఫ్ట్వేర్ లేదా సాఫ్ట్వేర్ అంటే కంపూటర్ ఏమి చెయ్యాలో తెలిపే కంప్యూటర్ కి సంబందించిన ప్రోగ్రాంల సమూహాన్ని కలిపి సాఫ్ట్వేర్ అంటారు.ఈ ప్రోగ్రాం లలో ఆదేశాలు, ఆజ్ఞలు వరుస క్రమంలో పేర్చబడి ఉంటాయి.
 
ఉచిత సాఫ్ట్వేర్ అనేది కూడా సాఫ్ట్వేరే కాకపోతే దీని పంపకం అనేది ఎలా ఉంటుందంటే దీనిని ఏ పనికైనా ఉపయోగించే సౌకర్యం మనకి కల్పిస్తుంది.అంటే ఉచిత సాఫ్ట్వేర్ ని మీరు నకలు తీసి పంచవచ్చు,సోర్సు కోడ్ ను క్షున్నంగా పరిశీలించవచ్చు, సవరించవచ్చు కూడా.ఉచిత సాఫ్ట్వేర్(ఫ్రీ సాఫ్ట్వేర్) అనే పదాన్ని 1983 లో తీసుకొని దాని ఉద్దేశ్యాన్ని,దిశా నిర్దేశాన్ని సూచించారు.అందులో 'ఉచిత' అనేది ఉచితంగా వచ్చే దాని కంటే మరింత స్వేచ్చను వాడుకరులకు ఇచ్చేదిగా ఉండాలి అని పేర్కొన్నారు.ఫ్రీ సాఫ్ట్వేర్ కు గత్యంతరముగా 'సాఫ్ట్వేర్ లిబరే' మరియు 'ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్' [FOSS] లను కూడా చేర్చారు.
ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమం [Free Software Movement] 1983 లో ప్రారంభమయ్యింది, దీని లక్ష్యం ఒక్కటే అధినాయకత్వ సాఫ్ట్వేర్ [proprietary software]లకు బదులుగా [replacement] ఉచిత సాఫ్ట్వేర్ ను రూపొందించడమే.అదే సంవత్సరం ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ను[fsf.org] కూడా స్థాపించారు.అధినాయకత్వ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే ఆ సాఫ్ట్వేర్ చట్టపరమైన హక్కులన్నీ అధినేతకి చెందడమే కాకుండా, సాఫ్ట్వేర్ ని కొన్నవారుకి సాఫ్ట్వేర్ కొన్ని వినియోగ నిబంధనలతో, ఇతర వినియోగాన్ని [నకలు తీయడం,సవరించటం] నిషేదిస్తూ సాఫ్ట్వేర్ ను ఇస్తారు.
ఈ ఉద్యమం నుండి పుట్టినవే గ్నూ, ది లినక్స్ కెర్నల్, మొజిల్లా ఫైరుఫాక్సు, ఓపెన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ స్యూట్, ఇతర నెట్వర్క్ సెర్వర్స్, ఫ్రీ బిఎస్డి, సాంబ మరియు అపాచి.  
ఉచిత సాఫ్ట్వేర్ ఉద్యమమే లేకుంటే ఒక ఉబుంటు కానీ ఫైరుఫాక్సు కానీ ఓపెన్ ఆఫీసు, విఎల్సి మీడియా ప్లేయర్..లను ఊహించగలరా..?

19, సెప్టెంబర్ 2010, ఆదివారం

ముందుమాట..!

నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధి.నాకు కంప్యూటర్ విద్య మీద చాలా మక్కువ ఎక్కువ.అందరికి అది అందుబాటులో ఉంటే మంచిదని ఆశిస్తున్నాను.లినక్స్ గురించి సరైన అవగాహనా లేకపోవడం వాళ్ళ చాలా మంది లినక్స్ ఆపెరేటింగ్ సిస్టం కష్టమేమోనని అనుకుంటారు నిజానికి అది అంత కష్టమేమి కాదు. ఇప్పుడు మరిన్ని హంగులతో userfriendly interface, layout తో తయారు చెయ్యబడింది అంతే కాకుండా దాదాపు అన్ని ముఖ్యమైన బాషలలోను లభిస్తుంది. తెలుగులో కూడా...!
అందుకని మీరు కూడా లినక్స్ వాడటానికి ఇష్టపడతారని ఆశిస్తా!
ఉచిత సాఫ్ట్వేర్,
లినక్స్ వాడకం పెంచటానికి మరియు లినక్స్లో సమస్యలను తొలగించడమే ఈ బ్లాగు ముఖ్య ఉద్దేశ్యం.